రేపు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు
NTR: ఉపరితలం ఆవర్తనం కారణంగా రేపు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడే సమయంలో చెట్ల క్రింద, బహిరంగా ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించారు. అవసరం ఉంటే తప్ప బయటకి రావోద్దని అన్నారు.