'పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నారు'

'పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నారు'

NLG: యేండ్ల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను పాలక పక్షాలు కాలరాస్తున్నాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. చిట్యాలలో ఆదివారం జరిగిన సీఐటీయూ మండల జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోజుకు 8 గంటల పని విధానానికి మంగళం పాడి పది నుంచి పన్నెండు గంటలు తీసుకొచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని వాపోయారు.