వాహనదారులకు అవగాహన కల్పించిన ఎస్సై
VZM: కొత్తవలస కూడలిలో ఎస్సై ఎన్. జోగారావు, సిబ్బందితో వాహనదారులకు శుక్రవారం అవగాహన కల్పించారు. శిరస్త్రాణం విధిగా ధరించాలని సూచించారు. ప్రధాన కూడళ్లలో నెమ్మదిగా వెళ్ళాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెల్ ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపకూడదన్నారు.