'డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక'

KMM: నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఏడేళ్ల క్రితం గ్రామంలో నిర్మించిన 30 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వివిధ కారణాలతో అసంపూర్తిగా వదిలేశారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి సూచనతో అదనపు కలెక్టర్ పి.శ్రీజ లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎంపిక చేశారు. వారికి లాటరీ పద్ధతిలో ఇళ్ల నంబర్లను కేటాయించారు.