కొమరాడలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు
PPM: కొమరాడ మండలం అర్తం గ్రామ సమీపంలో ఉన్న కొండ వద్ద గజరాజుల గుంపు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. సమీప ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పంట పొలాలకు వెళ్లే రైతులు ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. ఏనుగుల గుంపు సంచరిస్తున్నందున్న ప్రజలు భయాదోంళన చెందుతున్నామన్నారు.