VIDEO: కంభంలో మండుతున్న ఎండలు

VIDEO: కంభంలో మండుతున్న ఎండలు

ప్రకాశం: కంభంలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 41°C నమోదైంది. మధ్యాహ్నం తీవ్ర వేడిమితో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. వేడిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతుండగా అత్యవసర పనులకే బయటకు రావాలని వైద్యులు చెబుతున్నారు. డిహైడ్రేషన్ బారినపడకుండా తగినంత నీరు తాగాలని సూచిస్తున్నారు.