మంత్రి నేటి పర్యటన వివరాలు
WNP: జిల్లాలో నేడు మంత్రి వాకిటి శ్రీహరి పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆత్మకూరు మండలంలో ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేస్తారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్మించిన ఇండోర్ స్టేడియంను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వనపర్తి పట్టణంలోని లక్ష్మీ కృష్ణ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.