విరాళం అందజేత

విరాళం అందజేత

NRML: బాసర మండల కేంద్రంలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో చేపడుతున్న మున్నూరు కాపు వసతిగృహం, నిత్యాన్నదాన సత్రం కొరకు విరాళాలు సేకరిస్తున్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా నవీపేట్‌కు చెందిన భవంతి దేవిదాస్ రూ.1,01,000 విరాళంగా ముధోల్ నియోజకవర్గ అధ్యక్షులు రోళ్ళ రమేష్‌తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ సభ్యులు పాల్గొన్నారు.