నక్సలిజం నుంచి పూర్తి విముక్తి: అమిత్ షా
దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ సమావేశతం తర్వాత జరిగే డీజీపీలు, ఐజీపీల సదస్సు నాటికి దేశం ఈ సమస్య నుంచి పూర్తిగా విముక్తి పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నక్సలిజం, ఈశాన్య రాష్ట్రాల సమస్యలు, జమ్మూకశ్మీర్ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందించడంలో మోదీ ప్రభుత్వం విజయం సాధించిందని పేర్కొన్నారు.