రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: ఎస్పీ

WNP: రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ ఆదివారం అన్నారు. రోడ్డుపై వాహనదారులు ప్రతి ఒక్కరూ నియమాలు పాటించాలన్నారు. బైకులు నడిపేవారు హెల్మెట్లు, కారు నడిపే వారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. ఫోన్ మాట్లాడుతూ.. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయవద్దు అన్నారు.