వాకథాన్‌ను ప్రారంభించిన మంత్రి
HYD: ఫుడ్ సేఫ్టీ అవేర్ నెస్ వాకథాన్‌లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జలవిహార్ వద్ద వాక్‌ను జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. వాక్‌లో సుమారు 1000 మంది విద్యార్థులు, యువత పాల్గొన్నారు. జలవిహార్ నుంచి ఐమాక్స్ పక్కనున్న హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వరకు ఉత్సాహంగా వాకథాన్ కొనసాగింది.