శ్రీ సత్య గంగమ్మ ఆలయంలో పూజలు

శ్రీ సత్య గంగమ్మ ఆలయంలో పూజలు

CTR: పలమనేరు పట్టణ తాలూకా కచ్చేరి వీధిలోని శ్రీ సత్య గంగమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాన్నే అమ్మవారి శిలా విగ్రహాన్ని ఫల పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి, అలంకరించారు. భక్తులు గంగమ్మను దర్శించుకున్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో ఆలయంలో దీపాలను వెలిగించి అమ్మవారికి సమర్పించారు.