బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి శూన్యం: సోమ రాజశేఖర్

MHBD: బీఆర్ఎస్ హయాంలో తొర్రూరు పట్టణ అభివృద్ధి శూన్యమని, ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి హోదాలో ఉండి కూడా ఎలాంటి నిర్మాణాలు చేయలేదని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ విమర్శించారు. శనివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఖమ్మం-వరంగల్ హైవే డివైడర్, మున్సిపాలిటీ భవనం, జూనియర్ సివిల్ కోర్టు లాంటివి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కట్టామన్నారు.