మట్టి కుండ కొంటున్నారా..?

మట్టి కుండ కొంటున్నారా..?

వేసవిలో చల్లని నీటి కోసం మట్టి కుండను ఎంచుకోవడం ఉత్తమం. కుండ కొనేటప్పుడు అది సరిగ్గా కాలిందో లేదో తెలుసుకోవడానికి దానిపై వేలితో కొట్టి చూడండి. లోహపు శబ్దం వస్తే అది నాణ్యమైనదని అర్థం. ఎక్కడా పగుళ్లు లేకుండా చూసుకోండి. కొత్త కుండను వాడే ముందు ఒక రోజంతా నీటిలో నానబెట్టి, బాగా కడిగితే మట్టి వాసన రాదు. సహజమైన వడపోతకు, ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు!