'ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు'
KDP: ప్రభుత్వ రెవెన్యూ పొలాలు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సిద్ధవటం మండల తహసీల్దార్ ఆకుల తిరుమల బాబు తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ప్రభుత్వ భూములను ఆక్రమించకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా అక్రమంగా భూములను స్వాధీనం చేసుకుంటే వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.