వి.కోటలో పతనమైన టమాట ధరలు

వి.కోటలో పతనమైన టమాట ధరలు

CTR: వి.కోట మార్కెట్‌లో టమాటా ధరలు అమాంతంగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం 18 కిలోల టమాటా బాక్స్ ధర రూ.50 వరకు మాత్రమే పలుకుతుండగా, ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పంటను కోయకుండా తోటల్లోనే వదిలేస్తూ, కొందరు రైతులు కోసిన టమాటాలను రోడ్డుపక్కన పారబోస్తున్నారు.