జిల్లాలో యూరియా కొరత లేదు: శ్రీనివాసరావు

NZB: ఆలూరులోని ఎరువుల గోదాంను జిల్లా సహకార అధికారి శ్రీనివాసరావు మంగళవారం తనిఖీ చేశారు. జిల్లాలో రైతులకు యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. అవసరానికి అనుగుణంగా ఎరువులు తీసుకోలన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగినంత స్టాక్ గోదాంలో నిల్వ ఉంచినట్లు వెల్లడించారు.