'నేరాలు ఛేదనలో సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి'

'నేరాలు ఛేదనలో సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి'

ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కాశిరెడ్డిగూడ గ్రామంలో గ్రామ యువకుల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసీపీ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాలను ఛేదించడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, మండలంలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐ విజయ్, ఎస్సై రాజేష్ తదితరులు పాల్గొన్నారు.