విడవలూరులో క్షేత్ర పర్యటనకు విద్యార్థులు
NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇవాళ కళాశాల ప్రిన్సిపల్ సుజాత ఆధ్వర్యంలో క్షేత్ర పర్యటనకు వెళ్లారు. మండలంలోని ఊటుకూరు పల్లిపాలెం పెన్నా నది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతాన్ని సందర్శించారు. విజ్ఞాన క్షేత్ర పర్యటనలో భాగంగా మడ అడవులు, వలస పక్షుల విడిది, చేపల వేట, టైడల్ విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలను పరిశీలించారు.