గుడివాడలో ముమ్మరంగా వాహన తనిఖీలు
కృష్ణా: గుడివాడ మండలం మల్లాయిపాలెంలో ఎస్సై చంటిబాబు గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. వాహన పత్రాలు, లైసెన్స్, రిజిస్ట్రేషన్ వివరాలు సంపూర్ణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేశారు. ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కల్పించారు. అతివేగంగా వాహనాలను నడపరాదని వాహనదారులకు సూచించారు.