'ఎండిపోయిన వరి పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి'

నూతనకల్: నీళ్లు లేక ఎండిపోయిన వరి పంటలకు ఎకరాకు రూ.20 వేల నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కందాల శంకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం చిల్పకుంట్ల గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించి మాట్లాడారు. పొలాలు పొట్ట దశలో ఉన్నాయని ఎస్సారెస్పీ ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలన్నారు.