అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క

RR: చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని ముడిమ్యాలలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డిలు శనివారం పర్యటించారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో రూ.3.35 కోట్ల నిధులతో మల్కాపురం-ముడిమ్యాల బీటీ రోడ్డు, రూ.1.30 కోట్ల నిధులతో సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.