రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు: ఎస్‌ఐ

రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు: ఎస్‌ఐ

KNR: గన్నేరువరం మండలంలోని గ్రామాల్లో రోడ్ల పైన ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ జవ్వాజి అరుణ్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కల్లాలలో దాన్యం ఆరబోసుకోవాలని అన్నారు. రోడ్ల పైన ఆరబోయకూడదని హెచ్చరించారు. రోడ్ల పైన పోసిన ధాన్యం కుప్పల మూలంగా వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.