టీడీపీ నేతకు కూటమినేతలు నివాళులు

కడప: సిద్దవటం మండలంలోని నేకనాపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఎద్దుల వెంకటనరసయ్య శనివారం తన స్వగృహంలో గుండెనొప్పితో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి కృష్ణ, ఏపీ పంచాయతీ రాజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య, వెంకట నరసయ్య పార్థివదేహానికి ఘన నివాళులర్పించారు.