అధునాతన హంగులతో క్రికెట్ స్టేడియం

అధునాతన హంగులతో క్రికెట్ స్టేడియం

తమిళనాడులోని కోయంబత్తూరులో అధునాతన హంగులతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. రూ.500 కోట్ల వ్యయంతో 30 ఎకరాల స్థలంలో నిర్మించనుంది. ఈ మేరకు తమిళనాడు పారిశ్రామికాభివృద్ధి సంస్థ ఇటీవల టెండర్లను ఆహ్వానించింది. ఈ ఏడాది డిసెంబరు లేదా వచ్చే ఏడాది మొదట్లో పనులు ప్రారంభమవుతాయని టిడ్కో ఎండీ సందీప్ నండూరి వెల్లడించారు.