‘గ్యాంగ్ రేప్ చేశారు.. బయటే తిరుగుతున్నారు’
UPలోని మీరట్‌లో సామూహిక అత్యాచారానికి గురైన ఓ యువతి డీఐజీని కలిసి తన గోడు వెళ్లబోసుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'సర్, నాపై ఆరుగురు గ్యాంగ్ రేప్ చేశారు. నలుగురు జైల్లో ఉండగా, ఇద్దరు బయటే తిరుగుతూ నా సోదరుడిని చంపుతామని బెదిరిస్తున్నారు' అని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై DIG విచారణకు ఆదేశించారు. అంతకుముందు ఇన్‌స్పెక్టర్ పంకజ్ ఆమెను అడ్డుకోవడం వివాదాస్పదమైంది.