'మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ'

MDK: తూప్రాన్ పట్టణ పెద్ద చెరువు కట్టపై వనమోత్సవ కార్యక్రమం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. మొక్కలు నాటి పెంపకం చేపట్టడంతో పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రంగ కృష్ణ, ఎస్సైలు శివానందం, యాదగిరి, జ్యోతి పాల్గొన్నారు.