వైభవంగా ఆంజనేయ స్వామి వారి విగ్రహవిష్కరణ
E.G: రాజమండ్రిలోని అంబేద్కర్ నగర్ నందు శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహావిష్కరణ కార్యక్రమం శనివారం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరై స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.