పాలిటెక్నిక్ ఏర్పాటులో మధుసూదన్ పాత్ర కీలకం
WGL: దివంగత మాజీ MP ఇటీకాల మధుసూదన్ రావు కృషితో వరంగల్ నగరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల స్థాపన జరిగింది. విద్యా రంగాభివృద్ధి కోసం ఆయన కీలక పాత్ర పోషిస్తూ NIT, KMC, ITI వంటి సంస్థల ఏర్పాటుకు సహకరించారు. అప్పటి ప్రధాన నేతలతో సత్సంబంధాలు కొనసాగించిన ఆయన విద్యా విస్తరణకే ప్రాధాన్యం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ కళాశాలకు ఆయన పేరు పెట్టాలని అలుమ్ని సంఘం డిమాండ్ చేస్తోంది.