VIDEO: సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్న మహిళలు

NTR: విజయవాడ గుణదల ప్రాంతంలో శుక్రవారం ఒక భవనంపై సెల్ టవర్ నిర్మాణాన్ని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. తము ఆందోళన చేపట్టిన భవన యాజమాని వినిపించుకోకుండా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్న టవర్‌తో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. కొత్త టవర్ నిర్మాణం ఆపాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.