ఆశావర్కర్ పోస్టుల భర్తీకి నేడే లాస్ట్

SKLM: శ్రీకాకుళం జిల్లాలో ఖాళీగా ఉన్న 49 ఆశావర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునేందుకు గడువు సోమవారంతో ముగుస్తుంది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. అనిత ఒక ప్రకటనలో వెల్లడించారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి 25 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న మహిళలు అర్హులని ఆమె పేర్కొన్నారు. నేడు సాయంత్రంలోపు సచివాలయాల వద్ద దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.