రేపు రోడ్డు విస్తరణకై CPM నిరాహార దీక్ష

రేపు రోడ్డు విస్తరణకై CPM నిరాహార దీక్ష

SRD: పటాన్‌చెరు నుంచి దౌలతాబాద్ వెళ్లే ప్రధాన రోడ్డును విస్తరించాలని CPM రేపు (16న)ఇంద్రేశం దర్గా వద్ద నిరాహార దీక్ష చేయనున్నట్లు సీపీఎం నాయకుడు బీ.నాగేశ్వరరావు తెలిపారు. 150 నుండి 200 కొత్త కాలనీలు, విల్లాలు, అపార్ట్‌మెంట్లు రావడంతో ప్రధాన రోడ్డు ఇరుకుగా ఉండి, ప్రమాదాలకు నిలయంగా మారిందని అందువల్ల నాలుగు లైన్ల రోడ్డుగా 200 ఫీట్ల వెడల్పుకు విస్తరించాలని అన్నారు.