జవాన్ మురళి నాయక్ ఆదర్శప్రాయుడు: అప్పిరెడ్డి

GNTR: భారత సరిహద్దుల్లో దేశ భద్రత కోసం అసువులు బాసిన తెలుగు జవాన్ మురళి నాయక్ నేటి యువతకు ఆదర్శప్రాయుడని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మురళి నాయక్ సంతాప సభలో ఆయన మాట్లాడారు. ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని నింపడానికి వైఎస్ జగన్ ఈనెల 13న కల్లితండాకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలవనున్నారని చెప్పారు.