మెయిన్ సెంటర్లుగా అప్ గ్రేడ్.. నియామక పత్రాల పంపిణీ
W.G: ఆకివీడు ప్రాజెక్ట్ పరిధిలోని 13 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం మెయిన్ సెంటర్లుగా మార్చింది. ఈ కేంద్రాలతో పాటు మరో ఎనిమిది ఖాళీ పోస్టులకు ఎంపికైన సహాయకులకు గురువారం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అంగన్వాడీలు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు.