మాచవరం సర్పంచ్‌గా దాసరి సాంబశివరావు
MDK: రెండవ విడత ఫలితాల్లో మెదక్ మండలం మాచవరం గ్రామంలో సర్పంచ్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి సాంబశివరావు విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 333 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయం పట్ల స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.