తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్

TPT: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ముందుగా శ్రీవారి ఆలయం వద్ద TTD ఛైర్మన్ BR నాయుడు, EO అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా.. TTD ఛైర్మన్ తీర్థప్రసాదాలను అందజేశారు.