సిద్ధిరామేశ్వరాలయంలో కలెక్టర్ పూజలు
KMR: బిక్కనూర్ సిద్ధిరామేశ్వరాలయంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ నిన్న రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాస చివరి రోజును పురస్కరించుకొని ఆలయానికి విచ్చేసిన ఆయన, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆయన కార్తీక దీపాలను వెలిగించారు.