VIDEO: డ్రైనేజీ కాలువలు లేక ప్రజలకు ఇబ్బందులు
సత్యసాయి: పెనుకొండ మండలం మోటువారిపల్లి గ్రామంలో డ్రైనేజీ కాలువలు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు రోడ్లపై నిల్వ ఉండడంతో దుర్వాసన వ్యాపిస్తూ ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు పెరిగి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.