ప్రమాద భరితంగా కాజ్‌వే
E.G: తాళ్లపూడిలోని రాగోలుపల్లి తాడిపూడి గ్రామాల మధ్య కాజ్‌వే పూర్తిగా దెబ్బతింది. కొవ్వాడ కాల్వ వరద ఉద్ధృతికి ఒక వైపు పూర్తిగా కుంగిపోయి ప్రమాదభరితంగా మారింది. కాజ్వే పైభాగం కూడా గోతులు పడింది. గూటాల, పట్టిసీమ, తాడిపూడి గ్రామాల నుంచి గోకవరం ఫ్యాక్టరీకి వెళ్లే సిబ్బందితో పాటు రైతులు ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు.