భారీగా పట్టుబడిన డ్రగ్స్ ముడిసరుకు
HYD: తెలంగాణ ఈగల్ టీమ్ ఆగ్రాలో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఈగల్ టీమ్ ఆగ్రాలో డ్రగ్స్ డెన్‌ను గుర్తించింది. 10 కిలోల మెపిడ్రిన్, 1000 లీటర్ల ముడిసరుకును సీజ్ చేసి, ఐదుగురుని ఆగ్రా పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ ముఠా హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ ముడిసరుకును రవాణా చేస్తున్నట్లు ఈగల్ టీమ్ అధికారులు వెల్లడించారు.