'అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి'

WGL: వరంగల్ ఎంపీగా భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ విజయం సాధిస్తాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు మండల కేంద్రంలోని మల్లికార్జున గార్డెన్‌లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్‌తో ఎర్రబెల్లి పాల్గొన్నారు.