రేపు శ్రీశైలంలో కోటి దీపోత్సవం

రేపు శ్రీశైలంలో కోటి దీపోత్సవం

NDL: కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలంలో శుక్రవారం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా అధికారులు నిర్వహించనున్నారు. తొలిసారిగా శ్రీశైలంలో కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాన ఆలయం ఎదురు గంగాధర మండపం నుంచి నంది సర్కిల్ వరకు ఈ కోటి దీపోత్సవాన్ని నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.