విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన
AKP: గొలుగొండ మండలం ఏఎల్.పురం హైస్కూల్లో విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల భవన నిర్మాణానికి సర్పంచ్ లోచల సుజాత శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సర్పంచ్ మాట్లాడుతూ.. పీఎంశ్రీ పథకం ద్వారా మంజూరైన నిధులతో ఈ భవన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ భవన నిర్మాణం విద్యార్ధులకు ఎంతో ఉపయోక్తంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.