ప్రత్యేక అలంకరణలో ఆంజనేయుడు

ATP: రాయదుర్గం నియోజకవర్గం డి. హీరేహల్ మండలం మురిడీ గ్రామంలో వెలసిన ఆంజనేయుడికి శ్రావణమాసం చివరి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే సుప్రభాత సేవ, పంచామృత వివిధ అభిషేకాలు చేపట్టి స్వామి మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించి, మంగళ నైవేద్యాలు అందించారు. స్థానిక భక్తులే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది.