రాప్తాడులో భారీగా సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
ATP: రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలకు చెందిన 102 మంది లబ్ధిదారులకు రూ. 85 లక్షల విలువైన సీఎం సహాయనిధి (CMRF) చెక్కులు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 66 మంది లబ్ధిదారులకు రూ. 58 లక్షల విలువైన సహాయనిధి చెక్కులతో పాటు, రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కులను ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు.