ముగ్గులు.. మన సంప్రదాయానికి నిలువుటద్దాలు

ముగ్గులు.. మన సంప్రదాయానికి నిలువుటద్దాలు

SRPT: తెలుగు సంప్రదాయానికి ముగ్గులు నిలువుటద్దాలని మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ప్రవళిక ప్రకాష్ అన్నారు. ఇవాళ సూర్యాపేట పట్టణంలోని 36లో వార్డులో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. 90 మంది మహిళలు పాల్గొని తమ ప్రతిభను చాటగా, విజేతలకు బహుమతులు అందజేశారు. ఇటువంటి పోటీలు మహిళల్లోని సృజనాత్మకతను వెలికితీస్తాయని ఆమె హర్షం వ్యక్తం చేశారు.