'పేదల సంక్షేమం ధ్యేయంగా కాంగ్రెస్ పని చేస్తుంది'

'పేదల సంక్షేమం ధ్యేయంగా కాంగ్రెస్ పని చేస్తుంది'

KMM: పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. శనివారం తల్లాడ ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మండలానికి చెందిన 81 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.20,51,500 విలువైన సీఎం సహాయనిధి చెక్కులు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.