భారత్‌లోని యూదుల తరలింపునకు ఇజ్రాయెల్ ఆమోదం
భారత్‌లో ఉన్న 5,800 మంది యూదులను తమ దేశానికి తీసుకెళ్లేందుకు చేసిన ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2030 నాటికి వీరందరినీ ఇజ్రాయెల్‌కు తీసుకువెళ్లనున్నట్లు యూదు ఏజెన్సీ వెల్లడించింది. తొలుత 2026లో 1200 మందిని తరలించనున్నట్లు చెప్పింది. వీరికి అవసరమైన అన్ని సౌకర్యాలను వెస్ట్ బ్యాంక్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.