కరీంనగర్‌లో భారీ వర్షాల హెచ్చరిక.. ఎల్లో అలర్ట్ జారీ

KNR: రాబోయే నాలుగు రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలపై ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వాగులు, చెరువులు, నదులు పొంగిపొర్లే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.