చీడివలసలో 60 క్వింటాల పీడీఎస్ బియ్యం స్వాధీనం

SKLM: చీడివలస గ్రామంలో సివిల్ సప్లై అధికారులు దాడి చేసి 60 క్వింటాల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సూర్యప్రకాశ్తో పాటు నరసన్నపేట సివిల్ సప్లై డిప్యూటీ తాహశీల్దార్ డి.రామకృష్ణారావు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో భాగంగా గ్రామానికి చెందిన పొట్నూరు అప్పన్న కిరాణా దుకాణంలో PDS బియ్యం ఉన్నట్లు గుర్తించారు.